ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఎలమంచిలి నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరావు అన్నారు. అచ్యుతాపురంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.4,03,923 మంజూరైనట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని ఆరుగురు లబ్ధిదారులకు మాజీ ఎంపీ పప్పల చలపతిరావుతో కలిసి చెక్కులను శనివారం అందజేశారు. అనారోగ్యానికి గురైన వారికి చికిత్స కోసం ఈ నిధులు మంజూరయ్యాయని అన్నారు.