అచ్యుతాపురం మండలం పూడిమడక సముద్రంలో మత్స్యకారులకు భారీ తిమింగలం దొరికింది. ఆదివారం రాత్రి వేటకు వెళ్లగా వలలో పడినట్లు మత్య్సకారులు వివరించారు. వలలోని చేపలను తినేసిందని.. దీనివల్ల వలలకు కూడా నష్టం జరిగిందని పేర్కొన్నారు. సముద్రం ఒడ్డుకు తీసుకువచ్చిన దీనిని లోపలకు పంపించేందుకు ప్రయత్నించగా సాధ్యం కాలేదని వివరించారు. దీంతో ఒడ్డునే వదిలేశామని మత్స్యకారలు తెలిపారు.