రాంబిల్లి మండలం కృష్ణంపాలెం గ్రామానికి చెందిన ఎస్ఈజెడ్ నిర్వాసితులకు న్యాయం చేయాలని రాంబిల్లి మండలం సీపీఎం కన్వీనర్ దేముడు బాబు డిమాండ్ చేశారు. మంగళవారం గ్రామంలో నిర్వాసితుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామానికి చెందిన 300 కుటుంబాలకు నిర్వాసిత కాలనీ నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేరలేదన్నారు. దీనిపై అధికారులు జోక్యం చేసుకుని గ్రామస్థులకు న్యాయం చేయాలన్నారు.