ఎలమంచిలి మున్సిపాలిటీ కమిషనర్ కృష్ణవేణి బుధవారం వార్డు పర్యటన చేశారు. వార్డు ప్రజలకు తడి చెత్త పొడి చెత్త వేరుపై కమిషనర్ అవగాహన కల్పించారు. మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి త్వరలో డస్ట్ బిన్ లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి నెల కుటుంబానికి 60 రూపాయలు చొప్పున యూజర్ చార్జీలు తప్పనిసరిగా చెల్లించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి తో పాటు వార్డు కౌన్సిలర్ అచ్యుతరావు, మాజీ సర్పంచ్ కోడిగుడ్డు బ్రాహ్మణ బాబు, మున్సిపల్ డి ఈ వెంకటేశ్వరరావు ఏఈ లు సునీల్, ఉమామహేశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ చిట్టి బాబు, శానిటేషన్ సూపర్వైజర్ పైడి నాయుడు, కంప్యూటర్ ఆపరేటర్ తిరుమలరావు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.