యలమంచిలి పట్టణం ధర్మవరంలో వేంచేసి ఉన్న కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో డిసెంబర్ 2వ తేదీ నుంచి మార్గశిర మాసోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ కొఠారు సాంబ, సభ్యులు కొండబాబు, నాగేశ్వరరావు, నరేశ్ ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే ప్రతి గురువారం మహిళలతో కుంకుమ పూజలు నిర్వహించనున్నట్లు చెప్పారు.