నూట ఇరవై సంవత్సరాల గల యలమంచిలి మున్సిపాలిటీ లో గల ఆంధ్ర సెంటినరీ బాప్టిస్ట్ చర్చి లో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని బుదవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రపంచం లో శాంతిని నెలకొల్పి మానవాళికి రక్షణ నిమిత్తం యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చారని సంఘకాపరి రెవ్. అగస్టిన్ రాజు క్రిస్మస్ సందేశాన్ని అందించారు. అనంతరం కమిటీ వారు పేదలకి వస్త్రాలు పంపిణీ చేశారు. విశ్వాసులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.