త్వరలో టీచర్ల బదిలీల చట్టం తీసుకొస్తాం: మంత్రి లోకేశ్

67చూసినవారు
త్వరలో టీచర్ల బదిలీల చట్టం తీసుకొస్తాం: మంత్రి లోకేశ్
AP: విద్యావ్యవస్థలో టీచర్ల పాత్ర కీలకమైనదని, వారిపై భారం ఉంటే పని చేయలేరని మంత్రి నారా లోకేశ్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులపై ఒత్తిడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల బదిలీల చట్టం తీసుకొస్తున్నామని ప్రకటించారు. సీనియారిటీ జాబితాను ఉపాధ్యాయుల ముందు పెడతామని పేర్కొన్నారు. ఏదైనా తప్పులు ఉంటే సరి చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్