TG: బీరు బాటిళ్లలో ప్లాస్టిక్ స్పూన్లు కనిపించడంతో మద్యం ప్రియులు షాక్‌కు గురయ్యారు. వరంగల్ జిల్లా గిర్నిబావిలో గురువారం ఓ శుభకార్యానికి వచ్చిన బంధుమిత్రులు కలిసి మద్యం తాగారు. ఓ బాటిల్‌లో స్పూన్ మొత్తం ఉండగా.. మరో బాటిల్‌లో సగం విరిగిన స్పూన్ కనిపించింది. దీంతో కొనుగోలు చేసిన మద్యం షాపు వద్దకు వెళ్లి ప్రశ్నించారు. షాపు యజమాని వాటిని తీసుకుని రెండు బాటిళ్లు తిరిగి ఇచ్చాడు. ఈ ఘటనను సదరు కంపెనీ దృష్టికి తీసుకెళ్తామని షాపు నిర్వాహకులు తెలిపారు.