AP: రాష్ట్రంలో బెల్టు షాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆరోపించారు. హోంమంత్రి అనిత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నియోజకవర్గాల్లో బెల్టు షాపులు, ఓపెన్ బార్లు ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. బెల్టు షాపులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.