గుజరాత్‌లోని అమ్రోలీ జిల్లా లాఠీ తాలుకాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ–రిక్షా, బైక్ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారు జగదీష్ భాయ్, మోహన్ భాయ్ వాఘేలా, దినేష్ భాయ్‌గా పోలీసులు గుర్తించారు. దినేష్ భాయ్ కుమార్తె రాజల్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.