దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

62చూసినవారు
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలో బుధవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. దళిత సంఘాల ఐక్యత వర్ధిల్లాలి అని నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించారు. బంద్ నేపథ్యంలో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు ముసివేయగా, మరోపక్క ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పహారా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్