దూషించడం మభ్యపెట్టడం చంద్రబాబు నైజమని, రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ ఈ విషయం తెలుసు అని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. బుధవారం ఆచంట మండలం వల్లూరులో ఎన్నికల శంఖరావంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆశీస్సులు తీసుకున్నారు. అయిదేళ్లులో ప్రజలకు అందించిన సంక్షేమాన్ని, గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు.