భీమవరం వన్ టౌన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ భారతరత్న రాజీవ్ గాంధీ వర్ధంతి పురస్కరించుకుని భీమవరం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంకెం సీతారామ్ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున భారత ప్రధానిగా సుమారు 15 సంవత్సరాలు విశేష సేవలు అందించిన ఘనత మన రాజీవ్ గాంధీకే దక్కుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సోము నాగ కేశవ బాబు,తదితరులు పాల్గొన్నారు.