భోజనంలో నాణ్యత లేకుంటే కఠిన చర్యలు: ఎమ్మెల్యే నాయకర్

70చూసినవారు
భోజనంలో నాణ్యత లేకుంటే కఠిన చర్యలు: ఎమ్మెల్యే నాయకర్
నరసాపురం మండలం సీతారాంపురం జిల్లా పరిషత్ హై స్కూల్ లో సోమవారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భం విద్యార్థులతో కలసి ఎమ్మెల్యే నాయకర్ భోజనం చేశారు. భోజనం ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యతతో కూడిన మంచి భోజనాన్ని అందించాలన్నారు. నాణ్యత పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటానని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్