పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కలిదిండి రామరాజు ఎమ్మెల్యే కప్ సౌత్ స్టేట్ లెవెల్ వాలీబాల్ పోటీలను శనివారం రాత్రి జల వనరుల శాఖ మంత్రి నిమ్మల, జిల్లా కలెక్టర్ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్సన్ నయీమ్ అస్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా యువకులకు వాలీబాల్, క్రికెట్ క్రీడ కిట్లను పంపిణీ చేశారు. అలాగే యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడల వైపు దృష్టి సారించాలని మంత్రి సూచించారు.