మరో అల్పపీడనం ఏర్పడటంతో పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. బుధవారం ఉదయానికి నందమూరు అక్విడెక్టు వద్ద నీటి మట్టం 27 అడుగులకు చేరింది. వర్షాలు కొనసాగితే యనమదుర్రు పోటెత్తి ఆ కాలువ పరిధిలో చేలన్నీ నీట మునిగే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు.