గురువును ఎప్పటికీ మర్చిపోకూడదు: ఎమ్మెల్యే

55చూసినవారు
గురువును ఎప్పటికీ మర్చిపోకూడదు: ఎమ్మెల్యే
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అత్తిలి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గురు పూజోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ హాజరై సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉపాధ్యాయులను సన్మానించారు. ప్రతి మనిషికి జీవిత పాఠాలు నేర్పిన ఒక గురువు ఉంటారని, వారిని ఎప్పటికీ మర్చిపోకూడదని తెలిపారు.

సంబంధిత పోస్ట్