తణుకు బీసీ బాయ్స్ హాస్టల్ లో దారుణ పరిస్థితులు
తణుకు కార్పొరేషన్ బ్యాంక్ ఎదురుగా ఉన్న బీసీ బాయ్స్ హాస్టల్లో పిల్లలు అసౌకర్యకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. తినలేని ఆహారం, అశుభ్రమైన బాత్రూమ్స్, చుట్టూ చెత్త పేరుకుపోవడంతో పిల్లలు దోమలతో బాధపడుతున్నామంటూ విద్యార్థులు వాపోతున్నారు. ఈ సమస్యపై ఎన్ని సార్లు వార్డెన్ కి చెప్పిన స్పందించడం లేదని అక్కడి పిల్లలు వాపోతున్నారు. అధికారులు వార్డెన్ శ్రీనివాసరావు, అటెండర్ రామకృష్ణ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.