కాళ్ళ మండలం, కలవపూడి గ్రామంలో 6 కి. మీ మేర ఉన్న డ్రెయిన్ లో పూడిక తీత మరియు లోతు పెంచే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నాగరాణితో కలిసి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. 1979 తరువాత తన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ పనులు చేపట్టామని, జన్మభూమి స్పూర్తితో తన నియోజకవర్గంలోని అన్ని కాలువలలో దాతల సహకారంతో ఈ పూడికతీత పనులు నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు.