రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆచంట మండలం వ్యాప్తంగా వైసిపి నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొడమంచిలి గ్రామ సర్పంచ్ సుంకర సీతారాం ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండు మరియు ఫలహారాలు పంపిణీ చేశారు. అనంతరం అభిమానుల సమక్షంలో కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు.