రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై నిరసన చేపట్టనున్నట్లు ఆచంట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు చెరుకువాడ శ్రీ రంగనాథరాజు తెలిపారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఆచంట నియోజకవర్గ వ్యాప్తంగా పోరాటానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను సమాయత్తం చేస్తోంది. నిరసనల్లో భాగంగా, రేపు ఉదయం 10 గంటలకు తూర్పుపాలెం వైసీపీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా తరలి వెళ్లి నియోజకవర్గ కేంద్రమైన ఆచంటలోని సబ్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని వారు తెలిపారు.