అత్తిలి మండల వ్యాప్తంగా ద్వాల్వా పంట కోసం ముమ్మరంగా వరి నారుమడులు నిర్వహిస్తున్నారు. మండల కేంద్రం అత్తిలి, మంచిలి, పాలి, కొమ్మర, ఈడూరు, బల్లిపాడు, వరిగేడు, ఉరదాళ్లపాలెం, పాలూరు, కె సముద్రంగట్టు, ఆరవల్లి తదితర అన్ని గ్రామాలలో వ్యవసాయ పనులను వేగవంతం చేశారు. మరో వారంలో సంక్రాతి పండుగ నేపథ్యంలో సాధ్యమైనంత తొందరగా పనులు ముగించేందుకు రైతులు సన్నాహాలు చేస్తున్నారు.