విజయవాడ వరద బాధితుల సహాయార్థం శుక్రవారం ఆచంట నియోజకవర్గంలోని కూటమి నాయకులు బాధితులకు నేరుగా ఆహార పొట్లాలు, పాలు, కూరగాయలు మరియు నిత్యావసరాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తనయుడు పితాని వెంకట పాల్గొని ఆహారాన్ని తరలించే వాహనాన్ని జండా వైపు ప్రారంభించారు. అనంతరం పలువురి విజయవాడ తరలి వెళ్లడం జరిగింది.