అల్పపీడన ప్రభావం తో ఏ క్షణమైనా వర్షం వచ్చే సూచనలు కనిపిస్తుండడం తో బుధవారం పెనుమంట్ర మండలం లోని రైతులు ఆఘ మేఘాల మీద దాన్యం ఎగుమతులు నిర్వహించారు. మండల కేంద్రం పెనుమంట్ర తోపాటు బ్రాహ్మణచెరువు, బట్లముగుటూరు, ఆలమూరు, నత్తారామేశ్వరం, మార్టేరు, తదితర గ్రామాలలో దాన్యాన్ని మిల్లులకు తరలింపు చర్యలు చేపట్టారు. ఇంకోపక్క కొన్ని చోట్ల ఇంకా దాన్యం పట్టుబడులు పూర్తికాకపోవడం రైతులుఆందోళన చెందుతున్నారు .