పెనుమంట్ర: రేపు సచివాలయ భవనం ప్రారంభం

60చూసినవారు
పెనుమంట్ర: రేపు సచివాలయ భవనం ప్రారంభం
పెనుమంట్ర మండలంలోని వెలగలవారిపాలెం గ్రామంలో రూ. 43. 50 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని శనివారం మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ప్రారంభిస్తారని సర్పంచ్ వెలగల సుగుణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ భవనాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరై భవన నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తి చేశారు. ఎన్నికల అనంతరం రూ. 6 లక్షల పంచాయతీ నిధులు వెచ్చించి మైనర్ పనులను పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్