పశ్చిమగోదావరి జిల్లా పెనుగోండ మండలంలోని హరిజన పేటలో మానుకోండ అనంతలక్ష్మి వీల్ చైర్ లేక చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం చినమల్లం జనసైనికుల దృష్టికి వచ్చింది. వెంటనే జనసైనికుల సొంత డబ్బులతో ఆనంతలక్ష్మికి గురువారం విల్ చైర్ అందించారు. ఆపదలో ఉన్నపుడు ఆదుకోవడంలో జనసైనికులు ముందుటరని గ్రామ జనసేన నాయకుడు గరగ రాజేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు సుబ్రమణ్యం, సతీష్, మహేష్, మణికంఠ, సుబ్బు, నరేష్, సతీష్, చిన్నలు పాల్గొన్నారు.