విద్యాసంస్థలు ముందుకు రావడం అభినందనీయం: ఎమ్మెల్యే

60చూసినవారు
విద్యాసంస్థలు ముందుకు రావడం అభినందనీయం: ఎమ్మెల్యే
విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు మానవత్వంతో విద్యా సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం బ్యాంక్ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో విజయవాడ బాధితుల సహాయార్థం భీమవరం ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ రూ. లక్ష సహాయాన్ని శనివారం ఎమ్మెల్యే అంజిబాబుకు అందించారు. దాతలందిస్తున్న సహకారం ఎంతో విలువైనదని దాతలను అభినందించారు.

సంబంధిత పోస్ట్