భీమవరం సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహమును మంగళవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్నసౌకర్యాలు భోజన వసతులు పై ఆరా తీశారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలను రాబట్టారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనాన్ని రుచి చూశారు.