కష్టకాలంలో ఉన్నవారిని ఆదుకోవడం దాతలు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం భీమవరం అల్లూరి సీతారామరాజు సేవా సమితి రూ. లక్ష చెక్కును గురువారం ఎమ్మెల్యే అంజిబాబుకు అందించారు. మీరు చేస్తున్న సహాయం అందరికీ ఆదర్శమని దాతలను ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.