"ఫ్యామిలీ డాక్టర్" తో ఇంటి వద్దకే వైద్యం

689చూసినవారు
"ఫ్యామిలీ డాక్టర్" తో ఇంటి వద్దకే వైద్యం
ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా ప్రతి పేదవాడికి నిత్యం ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉంటుందని ఉండి లో జరిగిన ఒక కార్యక్రమంలో జిల్లా సోషల్ మీడియా కో ఇంఛార్జి దొరబాబు అన్నారు. ఆయన మాట్లాడుతూ పేదలు ఊహించడానికి కూడా లేని వైద్యాన్ని ఆరోగ్యశ్రీ కార్యక్రమంతో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అందరికీ అందుబాటులోనికి తీసుకువచ్చారన్నారు వారి కుమారుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అంతకుమించి ప్రతి పేద కుటుంబానికి డాక్టర్ అందుబాటులో ఉండే విధంగా, ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని అమలులోనికి తీసుకువచ్చినట్లు చెప్పారు వ్యాధిని గుర్తించడం దానిని తగ్గించేందుకు వివిధ రకాల వైద్య సేవలు అందించి మందులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పీహెచ్సీ లో ఉన్న ఇద్దరు డాక్టర్లు ఒకరు ఓపిలో, మరొకరు కేటాయించిన గ్రామానికి వెళ్లి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు , తగిన వైద్యం అందించడంతో పాటు ప్రతివారం ఆరోగ్యాన్ని పరీక్షిస్తారన్నారు. ముందు రోజు ఏఎన్ఎంలు , ఆశా సిబ్బంది సమాచారం ఇచ్చి రోగులను అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం విద్యా , ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ప్రతి గ్రామాలలో డాక్టరు వైయస్సార్ ఆరోగ్య హెల్త్ క్లినిక్ లు నిర్మించడం జరిగిందన్నారు. పీహెచ్సీలు అన్ని వాడుకలోకి తీసుకురావడం 108 , 104 వాహనాలను బలోపేతం చేయడం ఆరోగ్యశ్రీ అమలు చేయడంతో పాటు ఆరోగ్య ఆసరా కూడా అందించడం జరుగుతుందని తెలిపారు.
గ్రామీణ ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులో ఉండే విధంగా అవసరమైన వారిని గుర్తించేందుకు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఎంతో మేలుచేస్తుందన్నారు. మండలానికి రెండు ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి ఇద్దరు డాక్టర్ల తో పాటు ఇతర సిబ్బందిని ఏర్పాటు చేయడం చాలా సంతోషం అని యువ నాయకుడు దొరబాబు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్