పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలోని యనమదుర్రు గ్రామంలో సోమవారం ఉదయం 6 గంటల నుండే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం సచివాలయ సిబ్బందితో కలిసి ఎన్డీఏ కూటమి నాయకులు నిర్వహించారు. దివ్యంగులకు 15 వేల రూపాయలు, వృద్ధులకు, వితంతువులకు 7వేల రూపాయలు పంపిణీ చేయడంతో గ్రామంలోని పెన్షన్ దారులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు కృతజ్ఞతలు తెలుపుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ కు పాలాభిషేకం చేశారు.