భీమవరం రూరల్ మండలం కొమరాడలో గురువారం భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల్లో రాట్నాల సత్యనారాయణ రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాన్య కార్యకర్తలు కూడా బీజేపీలో ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రి అవ్వొచ్చు అన్నారు. దానికి నిదర్శనం తానే అన్నారు.