భీమవరం స్థానిక డి. ఎన్. అర్ కళాశాలలో ఆదివారం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2023 క్రికెట్ ఫైనల్స్ నిర్వహించారు. ఈ ఫైనల్స్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజీ టీమ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ టీమ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టీమ్ విజయం సాధించి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2023 ట్రోఫీనీ కైవసం చేసుకుంది. విజయం సాధించిన టీమ్ సభ్యులను ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం అంజన్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బీవీఎస్ వర్మ, స్టాఫ్ అభినందించారు.