ఉంగుటూరు గ్రామానికి చెందిన ఎస్.కె నాని బావ జమాల్ ఇంటి వద్ద మొదటిసారిగా పండుగకు రాగా, బుధవారం రాత్రి 116 రకాల వంటకాలతో భోజనం వడ్డించారు. ఈ అరుదైన ఆతిథ్యం చుట్టుపక్కల గ్రామస్తులను ఆకర్షించి, వంటకాలను తిలకించేందుకు ఆసక్తిగా చూశారు. పల్లెటూరిలో ఇలా బావకు ప్రత్యేకంగా భోజనం ఏర్పాటు చేయడం విశేషంగా నిలిచింది.