జంగారెడ్డిగూడెం పురపాలక సంఘ కమీషనర్ గా శుక్రవారం కె.వి. రమణ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని వార్డుల పరిపాలన కార్యదర్శులు కమీషనర్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కమీషనర్ మాట్లాడుతూ పట్టణాన్ని పచ్చదనంలో అగ్రస్థానంలో నిలుపుతామని పేర్కొన్నారు. పట్టణ ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు.