ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం పట్టణంలోని స్థానిక బస్టాండ్ వద్ద మాల మహానాడు ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అలాగే అమిత్ షా ను బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఖబర్దార్ అమిత్ షా అంటూ నినాదాలు చేశారు.