చింతలపూడి మండలంలోని ఎర్రంపల్లి పంచాయతీ పరిధిలో తలార్లపల్లి గ్రామం వద్ద గత 15 రోజుల క్రిందట ఆర్ అండ్ బి రోడ్డుకు ముళ్ళ తుమ్మ చెట్టు అడ్డంగా పడి ఉంది. దీంతో ముళ్ళు గుచ్చుకొని వాహనాలకు పంచర్లు పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా రహదారికు అడ్డంగా చుట్టూ ఉండడంతో వాహన రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు తంటాలు పడుతున్నారు. కావున అధికారులు వెంటనే చెట్టుని తొలగించాలని కోరుతున్నారు.