దెందులూరు మండలం సోమవరప్పాడులో పెనియేల్ చర్చి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి చంటి హాజరయ్యారు. అనంతరం చింతమనేని మాట్లాడుతూ. పెనియల్ నూతన మందిర శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని అన్నారు.