ఏలూరు జిల్లాలో జనవరి 2025 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో ఎస్ఎస్ఆర్ -2025 డ్రాఫ్ట్ పబ్లికేషన్‌ను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్బంగా జిల్లాలో ఎస్ఎస్ఆర్ -2025లో భాగంగా 16,38,436 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఇందులో పురుష ఓటర్లు 7,99,781, మహిళలు 8, 38, 531, థర్డ్ జెండర్ ఓటర్లు 124 మంది ఉన్నారన్నారు.