ఏలూరు జిల్లాలో 2వ రోజు టెట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉదయం నిర్వహించిన పరీక్షకు 185 మంది విద్యార్థులకు గాను 159 మంది, మధ్యాహ్నం 185 గాను 163 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. అదేవిధంగా ఉదయం 26 మంది, మధ్యాహ్నం 22 మంది గైర్హాజరయ్యారని చెప్పారు.