పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ జాతీయ సమితి ఇచ్చిన పిలుపుమేరకు గురువారం సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో ఏలూరు మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.