ఏలూరు పాత బస్టాండ్ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా జరిగింది. ఈ ధర్నాలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ. సెప్టెంబర్ 1న విజయవాడని ముంచెత్తిన వరదల సందర్భంగా ప్రభుత్వం చెప్తున్నా వరద ఖర్చులు చూస్తే తారాస్థాయిలో జరిగినట్లు అర్థమవుతుందన్నారు. కానీ వరద పరిహారాలు ఇచ్చేటప్పుడు బాధ్యత కుటుంబాల సంఖ్య వేలలో చూపించారన్నారు.