పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని ప్రైవేటీకరించవద్దని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కట్టా భాస్కరరావు, కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం ఏలూరు అన్నే భవనంలో వారు పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణ, ఆయిల్ పామ్ రైతుల సమస్యలపై మాట్లాడారు. జిల్లాలో రోజురోజుకీ ఆయిల్ పామ్ విస్తీర్ణం పెరుగుతోందని, దేశంలోనే అత్యధికంగా ఏలూరు జిల్లాలో ఆయిల్ పామ్ సాగు ఉందన్నారు.