ఏలూరు ఆశ్రమ ఆసుపత్రి వద్ద బుధవారం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని మినీ వ్యాన్ వెనుక నుంచి ఢీ కొట్టిన ఘటనలో మినీ వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. దెందులూరు నుంచి ఏలూరు వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. క్యాబిన్ లో ఇరుక్కుపోయిన మినీ వ్యాన్ డ్రైవర్ ను జేసీబీ సాయంతో బయటకు తీశారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.