కొత్త వ్యవసాయ బోర్లుకు విద్యుత్ కనెక్షన్లు వెంటనే మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కట్టా భాస్కరరావు, కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏలూరు అన్నే భవనంలో వ్యవసాయ బోర్లకు విద్యుత్ కనెక్షన్ల సమస్యపై వారు మాట్లాడారు. జిల్లాలో 720 కొత్త వ్యవసాయ బోర్లకు విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయకపోవడం వలన రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.