ఏలూరు విద్యానగర్ లోని ఏపీఎస్ఎస్ఎస్ కార్యాలయం ఆవరణలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే బడేటి చంటి శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తోటివారిని ఆదరించి, ప్రేమించాలన్న యేసు క్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు. అలాగే ఎంతో మంది పేదలకు ఆపన్నహస్తం అందిస్తోన్న బిషప్ డాక్టర్ జయరావు పొలిమేర సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.