ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి ఇందిరా కాలనీలో నివాసాల మధ్య సెల్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకున్న గ్రామస్థులు శనివారం ఆందోళన చేపట్టారు. తమ అభ్యంతరాలు తెలుసుకోకుండా టవర్ నిర్మించేందుకు అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉదృిక్తంగా మారడంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ఆందోళనకారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.