ఏలూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు మరియు వరదల వల్ల అనేక ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా అధికారులు జిల్లాలో జరిగిన నష్టాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా భారీ వర్షాల వల్ల నీట మునిగిన పంటచేలు, విద్యుత్ ఘాతకానికి గురై మృతి చెందిన మూగజీవాలు, కొట్టుకపోయిన రోడ్లు, నేలకూలన నివాసాలు, గండి పడిన చెరువులను ఆయన వీక్షించారు.