ఈనెల 27న ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర రైతు సదస్సును జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ద్వారకాతిరుమల మండలంలోని నారాయణపురం, గుణంపల్లి, ఎం. నాగులపల్లి, పంగిడిగూడెం గ్రామాలలో రైతు సంఘం నాయకులు ప్రచారం నిర్వహించారు. అనంతరం కరపత్రాలు పంపిణీ చేసి రైతులందరూ పాల్గొనాలని కోరారు.