భారత స్వాతంత్య్ర సమరయోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవం కార్యక్రమాలు జరిగాయి. ఈ వేడుకల్లో ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యారంగంలో ఆయన చేసిన సేవలను కలెక్టర్ కొనియాడారు.